ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
18.06.22: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువు వినయ్ కుమార్ అద్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మహా గణపతిమ్, ఝేమ్ ఝేమ్ తనన, జతిస్వరం, సతులారా చూడరేయ్, అదిగో అల్లదిగో, నారాయణతేయ్ నమో నమో, అమ్మకౌతం, నగుమోము, విన్నపాలు వినవలెయ్, దశావతార శబ్దం మొదలైన అంశాలను మాన్య, శ్రీజ, మాధురి, దీక్ష, శ్రీనిధి, భువణ్య, శాన్వి రెడ్డి, ప్రత్యుష, మయుక్త, లాస్య, ధరణి, నేహా మొదలైన కళాకారులు ప్రదర్శించారు.