మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం ప్రదర్శనలు, 82వ వార్షికోత్సవం నిర్వహించుకున్న ఆంధ్ర బాలానందం సంఘం
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం ప్రదర్శనలు, 82వ వార్షికోత్సవం నిర్వహించుకున్న ఆంధ్ర బాలానందం సంఘం
18.06.22: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 1940 లో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘము వారు ఎనభై రెండు సంవత్సరాల నుండి ఎందరో కళాకారులను లలిత సంగీతం , చిత్ర లేఖన, భరతనాట్య ప్రదర్శనలో శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు వారి ఎనభై రెండవ వార్షికోత్సవాన్ని శిల్పారామం లో నిర్వహించుకోవడం జరిగింది. బాలానందం వారి శిష్యులు లలిత సంగీతం మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. లలిత సంగీతంలో కలగా కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో మా తెలుగు తల్లికి, వెన్నెల వెన్నెల, మా చాచా, చూడ కనులకింపు, పలు మాటల భాషలు, మొదలైన పాటలను రామ సృజన, లహరి, అలేఖ్య, అభినవ్, వైష్ణవి, లాస్య, అనురాగ్ మొదలైనవారు ఆలపించారు.
గురువర్యులు బద్రీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులు భరతనాట్య ప్రదర్శనలో భాగంగా వినాయక స్తుతి, జయ జయ ప్రియా భారతి, కీర్తన, రుద్ర స్తుతి, కోలాటం సాంగ్, తిల్లాన అంశాలను వైష్ణవి, పూర్వజా, శ్రావణి, రాఖి, శ్వేతా, శివాని, గ్రీష్మ, గీతికా ,శ్రీవల్లి, తేజస్విని, మొదలైన వారు పాల్గొన్నారు.
కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు, చొక్కాపు వెంకట రమణ, డాక్టర్ చిత్తరంజన్ బాలానందం అధ్యక్షులు మరియు కార్యదర్శి కామేశ్వరి విచ్చేసి కళాకారులను అభినందించారు.