శ్రీత్యాగరాయ గానసభ: ఆదర్శ దంపతులకు సత్కారం
ఆదర్శ దంపతులకు సత్కారం
శ్రీత్యాగరాయ గానసభ: సంసారమనే బండికి భార్య భర్త ఇరువురూ రెండు చక్రాలని వారి వారి రంగాల్లో రాణించాలంటే పరస్పర సహకారం అవసరమని ప్రముఖ సాహితీవేత్త వోలెటి పర్వ్యతీశం అన్నారు.
శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై జీ.వీ.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహణలో సప్తపదిలో తోడు నీడ శీర్షికన వివిధ రంగాల్లో జీవిత భాగస్వామి సహకారంతో రాణిస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ముఖ్య అతిధిగా పర్వ్యతీశం పాల్గొని మాట్లాడుతూ భర్త విజయాన్ని భార్య, భార్య విజయాన్ని భర్త పాలు పంచుకోవడంలోనే మాధుర్యం వుందన్నారు.
వ్యాపారవేత్త చిల్ల రాజశేఖర రెడ్డి అధ్యక్షత వహించిన సభలో కవి పొత్తూరి సుబ్బారావు, శ్యాం ప్రసాద్, తదితరులు పాల్గొన్న సభకు జీ.వెంకట రెడ్డి స్వాగతం పలికారు. పురస్కారాలను వరలక్ష్మి దంపతులు, భరత లక్ష్మీ దంపతులు, నరసింహ ప్రసాద్ దంపతులు, రేణుక ప్రభాకర్ దంపతులు, మహా లక్ష్మీ దంపతులు, నాగ రాజ శర్మ దంపతులు అందుకున్నారు. కార్యక్రమానికి తొలుత చిల్ల శివ పార్వతి శిష్య బృందంచే సినీ గాన విభావరి అలరించింది.