శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: ధర్మపథంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం
ధర్మపథంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం
సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు శ్రీ పి. ప్రమీలరాణి, మరియు వారి బృందం విజయవాడ వారిచే భజన కార్యక్రమం నిర్వహించబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో పలు భక్తి గీతాలు, అష్టకాలు మొదలైన వాటిని రమాదేవి, వాణి, పద్మ థి.. వారము. నకరత్నం. కనకదు. పుష్పవతి జయ, నిర్మల శారద, రంగ పుష్ప తదితరులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు
కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు
రేపు శ్రీ పి. జ్వాలాముఖి మరియు వారి బృందం, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.