శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సహస్ర దీపాలంకరణ సేవ
సహస్ర దీపాలంకరణ సేవ
సోమవారం స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు.
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (27.06.2022) శ్రీ లహరి నృత్యనికేతన్, హైదరాబాద్ వారిచే ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య, కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, జతిస్వరం, మూషికవాహన, శివపంచాక్షరి, దేవిస్తుతి తదితర గీతాలకు శ్రీమతి ఝాన్సీరామ్ వారి ఆధ్వర్యములో సత్యప్రదీప్తి, శ్రీలేఖ,మనస్విత, హరిణి, అనుదీప్తి, పునీత,శ్రీనిధి, నిత్యశ్రీ, కీర్తి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు
రేపు (28.06.2022) శ్రీ గౌరీశంకర్ నృత్య అకాడమి, పశ్చిమగోదావరి జిల్లా వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.