శ్రీ త్యాగరాయ గానసభ: సాంస్కృతిక వార్తలకు పత్రికలు ప్రాధాన్యత నీయాలి
సాంస్కృతిక వార్తలకు పత్రికలు ప్రాధాన్యతనీయాలి
సాంస్కృతిక సంస్థలు ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో ప్రణాళిక, నిర్వహణ సామర్ధ్యం అవసరమని వారు నిర్వహించే కళా ప్రదర్శనలకు తగిన ప్రాధాన్యత వార్త పత్రికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కే.వీ.రమణ కోరారు. శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై ప్రముఖ సాంస్కృతిక మహిళా సంస్థ అభినందన నిర్వహణలో శుభకృత్ ఉగాది పురస్కారాలు వివిధ పత్రికల్లో ని సాంస్కృతిక విలేకరులకు బహుకరణోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగడాక్టర్ రమణ పాల్గొని మాట్లాడుతూ సాంస్కృతిక వార్తా రచన సులువు కాదన్నారు. కారోన కాలంలో విలేకరులుఇబ్బందులు పడ్డ విషయం గుర్తు చేశారు. అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలెటి పర్వతీశం మాట్లాడుతూ సాంస్కృతిక వార్తలు గతంలో కళాకారుల ప్రదర్శనలు విశ్లేషిస్తూ ప్రముఖు లు రాసే వారని ఇప్పుడు పత్రికా విధానంలో మార్పులు వచ్చినందున రాయగలిగిన వారున్నా కేవలం వార్త కే పరిమితమైనారని అన్నారు. సినీ నటి శివ పార్వతి మాట్లాడుతూ కళాకారులకు ప్రోత్సాహము పత్రికల్లో వచ్చే వార్తలేనని అన్నారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమణి గాయకులు త్రినాధ రావు పాల్గొన్న సభకు భవాని స్వాగతం పలుకుతూ నలభై ఏళ్లుగా అభినందన సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగా పత్రికా విలేకరులు సహకారం మారువలేనిదన్నారు పురస్కారాలు అందుకున్న వారిలో రమణ, రమేష్ కృష్ణ, బాల కృష్ణ, శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్, కనక చారి, సతీష్, రామిరెడ్డి, పరశురాముడు వున్నారు. త్రినాథరావు సృజనాత్మక తో సాహిత్యం చూడకుండా ఘంటలో 20 గీతాలు గానం చేసి శ్రోతలను రసానందం లో ముంచెత్తారు