మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి మరియు భరతనాట్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి మరియు భరతనాట్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కర్ణాటక గాత్ర కచేరి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
శ్రీ నరేష్ విశాల్ గారి శిష్య బృందం చే కర్ణాటక గాత్రం లో రామదాసు సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. శ్రీమతి అనురాధ గారి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో భాగంగా అలరిపు, నటేశ కౌతం, పుష్పాంజలి, మూషిక వాహన, అష్టలక్ష్మి, తిల్లాన, కాలభైరవాష్టకం, శివ తాండవం, భో శంభో , కంజదళయాదాక్షి మొదలైన అంశాలను మనస్విని, రుచిత, కావ్య, స్వాతి హన్సి, సహస్ర , ఖుషి, వర్ష, సమన్వి, లక్ష్మి క్షీర మొదలైన వారు ప్రదర్శించారు.