మాదాపూర్ శిల్పారామంలో కనువిందు చేసిన కూచిపూడి మరియు కథక్ జుగల్బందీ నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో కనువిందు చేసిన కూచిపూడి మరియు కథక్ జుగల్బందీ నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో తరుణ రెడ్డి అద్వర్యంలో కూచిపూడి మరియు కథక్ జుగల్బందీ ప్రదర్శన ఎంతగానో అలరించింది. కుమారి గౌరవి రెడ్డి కూచిపూడి నృత్యం, గురువు కుమారి నిహంత్రి రెడ్డి శిష్య బృందం, గురువు యోగిని ఖానోర్కార్ శిష్య బృందం కథక్, గురువు ఐశ్వర్య రెడ్డి శిష్య బృందం కూచిపూడి నృత్యం జుగల్బందీ నృత్యాలు ఎంతగానో అలరించాయి.
స్వాగత నృత్యం, గణేశా వందన, సంకటహర గణేశా స్తోత్రం, మీరా భజన, స్వాగతం కృష్ణ, శుద్ధ బ్రహ్మ, పాయలియా, భామాకలాపం, సరస్వతి నమోస్తుతేయ్, నమో నమో భారతంబే, నమో శారదా, శివ తాండవం, తాండవ స్తోత్రం, జతిస్వరం, తరణ, తారంగం, తిల్లాన, మంగళం అంశాలను దాదాపుగా డెబ్భై మంది కళాకారులు పాల్గొని సందర్శకులకు కనువిందు చేసారు.
డాక్టర్ గోపినాథ్ రెడ్డి ఐ పి ఎస్ విశ్రాంత డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్, ఆర్ కె గౌడ్ చైర్మన్ , తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు డాక్టర్ అనురాధ కూచిపూడి గురువులు ముఖ్య అతిధులు గా విచ్చేసి కళాకారులను ప్రోత్సహించారు.