|

మాదాపూర్: శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా”

శిల్పారామంలో నేటి నుంచి “అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా”


శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ & కల్చరల్ సొసైటీ మాదాపూర్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ” అంతర్జాతీయ హస్త కళల ఉత్సవం ” అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా డిసెంబర్ పదిహేను నుండి ప్రారంభం అవుతుందని శిల్పారామం ప్రత్యేక అధికారి జి. కిషన్ రావు తెలిపారు. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కొరకు చేనేత మరియు హస్త కళాకారుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ మరియు నేషనల్ జ్యూట్ బోర్డు వారి సంయుక్త నిర్వహణలో శిల్పారామం మాదాపూర్ లో క్రాఫ్ట్ మేళాను తెలంగాణ రాష్ట్ర టూరిజం అండ్ కల్చర్, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు.

క్రాఫ్ట్ మేళా కోసం దేశం నలుమూలలనుండి దాదాపుగా 500 స్టాల్ల్స్ శిల్పారామంలో కొలువుతీరి ఉంటాయిని, చేనేత వస్త్రాలు, హస్త కళలు, చెక్క బోమ్మలు, విగ్రహాలు, , జ్యూట్ బాగ్స్, బొమ్మలు, ఆర్టిఫిషల్ జ్యువలరీ, టెర్రకోట, వెదురు ఫర్నిచర్ మొదలైన రక రకాల ఉత్పత్తులు సందర్శకుల కోసం ఉదయం 10 .30 నుండి సాయంత్రం 8 .00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి అని స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం కిషన్ రావు తెలిపారు.

ప్రతి రోజు సాయంత్రం వివిధ రాష్ట్రాల కళాకారులతో శాస్త్రీయ జానపద సంగీత నృత్య కార్యక్రమాలు సందర్శకుల ఆహ్లదం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రంగు రంగు ల కాంతులతో, ఫౌంటైన్స్, పచ్చిక బయలు నడుమ, ఎడ్లబండి మరియు బోట్ షికారు, ఫుడ్ కోర్ట్స్, పిల్లల ఆటస్థలాలు శిల్పారామం మొత్తం ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని, కావున సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి చేనేత హస్తకళకారులను ప్రోత్సహించగలరని స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు కోరారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *