ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలతో భాగంగా కళాకృతి నృత్యాలయా గురువర్యులు భారతి శ్రీనివాస్ శిష్య బృందంచే భరతనాట్యం నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతిమ్, రామరామ రామసిత, నర్సింహా కౌతం, షణ్ముఖ కౌతం, ముద్దుగారేయ్ యశోద, దుర్గే దుర్గే, అన్నమాచార్య కీర్తన, తిల్లాన అంశాలను వందన, సహస్ర, యోచిత, సంజన, శ్రేయ, మీనాక్షి, శ్రీనయన, క్రిష్మిత మొదలైన వారు చక్కని ప్రదర్శన ఇచ్చారు. కూచిపూడి నృత్య గురువులు డాక్టర్ కిరణ్మయి బోనాల మరియు డాక్టర్ జ్యోతి శేఖర్ విచ్చేసి కళాకారులను ప్రోత్సహించారు.