మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భక్తి సంగీతం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఉదయ శ్రీ మరియు సంగీతలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు మరియు భక్తి పాటలు ఎంతగానో అలరించాయి. అనూష శ్రీనివాస్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యంలో గజవదాన భేదువే, పుష్పాంజలి, కులుకక నడవరో, దశావతారం, కృష్ణ శబ్దం, తిల్లాన అంశాలను సుమతి, శ్రీనివాస్, భావన, సంజిత, మానస, శాన్వి, ప్రణతి, అవని, కీర్తి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.