ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీ గురు నృత్యాలయం గురువర్యులు శ్రీలక్ష్మి నల్లమోలు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, జతిస్వరం హనుమాన్ చాలీసా, దశావతారం, అన్నమాచార్య కీర్తనలు, తిల్లాన అంశాలను ఆధ్య, ఆరోహి, దీపశిక, హేమ, జస్విత, లాస్య, మధులిక, నిఖిల, మేధ, రిత్విక, శ్రేయ, స్ఫూర్తి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.