|

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ

శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (24.06.2022) సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించారు.

ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది. ఈ సాయంత్రం ఈ ఊయలసేవ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్తోక్షంగా షోడశోపచార పూజ జరిపించారు. ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపించారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు.

ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించబడ్డాయి.

24.06.2022 Uyala Seva Photos

 

అంకాళమ్మ వారికి విశేష పూజలు 

లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి ఈ రోజు ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది.

ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది. .

ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి.

కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.

ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.

చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.

అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం అర్చన ను నిర్వహించబడ్డాయి.

24.06.2022 Ankalamma Visesha Pooja photo

 

సాంస్కృతిక కార్యక్రమాలు 

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (24.06.2022) ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి స్నేహ రామచంద్ర, హైదరాబాద్ వారిచే “ద్వాదశ జ్యోతిర్లింగాలు” అనే అంశంపై రాగమాలిక నాట్య అభినయ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ రూపకాన్ని శ్రీమతి తులసీ పద్మగారు రచించగా, డా. కూడుపూడి శ్రీధర్ సంగీత దర్శకత్వం వహించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య, కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

24.06.2022 Kalaradhana (Sampradaya Nrutyam) Photo

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు

రేపు (25.06.2022) శ్రీ పద్మప్రియ గ్రూప్, హైదరాబాద్ వారిచే భక్తిరంజని కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *