|

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (02.07.2022) శ్రీ సాయి నటరాజ నాట్యలయం , సికింద్రాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భరత నాట్యం కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమములో వినాయకౌత్వం, శివతాండవం, భో శంభో శివశంభో, పంచముర్తి స్తుతి, అష్టలక్షిస్తుతి తదితర గీతాలకు కె. శ్రీనివాస్, మానస, విలేక , వర్షిణి , హర్షిని, హంస, నక్షత్ర, లిఖిత, రమ్య, సుధ, శ్రీధ,అనన్య, ప్రణతి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.

కాగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు

రేపు (03.07.2022) శ్రీ భవాని విజయ్ మరియు వారి బృందం, హైదరాబాదు వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆర్జిత సేవగా సహస్రదీపార్చన మరియు ఊయలసేవ

భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం ఆర్జితసేవగా “సహస్రదీపార్చన మరియు పుష్పాలంకృత ఊయల సేవ”ను తేది : 10.07.2022 నుండి నిర్వహించడం బడుతుందని శ్రీశైల దేవస్థానం వారు ప్రకటనలో తెలిపారు .

కాగా ప్రతీ సోమవారం రోజున శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు సహస్రదీపార్చన సేవ మరియు ప్రతి శుక్రవారం, మూలానక్షత్రం రోజు, మరియు పౌర్ణమిరోజులలో పుష్పాలంకృత ఊయల సేవ కార్యక్రమాన్ని సర్కారీ సేవగా దేవస్థానం నిర్వహిస్తున్నది.

అయితే భక్తులు సౌకర్యార్థం ప్రస్తుతం ఈ సేవలను ప్రత్యక్ష ఆర్జిత సేవగాను మరియు పరోక్షసేవగానూ జరిపించుకునేందుకు అవకాశం కల్పించబడింది.

సహస్రదీపార్చనసేవకుగాను రూ. 1116/-లు రుసుముగా నిర్ణయించబడింది. ప్రతి సోమవారం సాయంత్రం ఈ సేవ నిర్వహించడం జరుగుతుంది.

అదేవిధంగా పుష్పాలంకృత ఊయలనేవ ఆర్జిత రుసుము కూడా రూ.1116/-లు రుసుముగా నిర్ణయించబడింది. ప్రతి శుక్రవారం, మూలానక్షత్రం రోజు మరియు పౌర్ణమిరోజులలో సాయంత్రం నుండి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ ఆర్జిత సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చును. సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వా రా చెల్లింపు చేయవచ్చు .

ప్రత్యక్షముగా ఈ సేవలను జరిపించుకొను భక్తులు ఆయా సేవాటికెట్లను ఆర్జిత సేవా కౌంటర్ల నుండి కూడా పొందవచ్చు.

ఈ సేవలను జరిపించుకొను సేవాకర్తలకు అతి శీఘ్రదర్శనం క్యూలైన్ నందు (రూ.300/-ల క్యూలైన్) శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించబడుతుంది. సేవానంతరం లడ్డుప్రసాదాలు ( 100 గ్రాములు బరువుగల 2 లడ్లు) అందజేయబడుతాయి.

కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు ఆన్‌లైన్ ద్వారా రుసుమును చెల్లించి పరోక్షంగా వారి గోత్రనామాలతో ఈ సేవను జరిపించుకోవచ్చు.

పరోక్షసేవాకర్తలు వారి పేర జరిగే సేవలను వీక్షించేందుకు వీలుగా శ్రీశైలటీవి | యూ ట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారాలను చేయడం జరుగుతుంది.

పరోక్షసేవలను జరిపించుకొనువారికి అక్షతలు, విభూతి, కుంకుమ, క్రిస్టల్స్ ప్రసాదాన్ని తపాల ద్వారా పంపడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం పత్రిక ప్రకటనద్వారా కోరారు.

బదిలీ అయిన ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం

సాధారణ బదిలీలలో భాగంగా రాష్టదేవదాయశాఖ మొన్నటి రోజున (30.06.2022) ఈ దేవస్థానములోని వివిధ క్యాడర్స్ లో గల 45 మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేయడం జరిగింది.

ఈ దేవస్థానము నుండి బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు వీడ్కోలు చెప్పేందుకు కార్యాలయ భవనములోని సమావేశమందిరంలో ఈ రోజు ( 02.07.2022) ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణాధికారివారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ బదిలీ అయిన ఉద్యోగులందరు కూడా బాధ్యతాయుతంగా అంకితభావంతో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్యోగుల సహకారం వలనే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలిగిందన్నారు.

అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు, దసరా మహోత్సవాలు, కార్తికమాసోత్సవాలు మొదలైన ఉత్సవాలన్ని కూడా ఉద్యోగుల సహకారం వలనే విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

ఉద్యోగులందిరికీ శ్రీశైల అధిదేవులైన శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కృపాకటాక్షాలు ఎల్లవేళలా లభిస్తుండాలని ఆకాంక్షించారు.

శ్రీశైలదేవస్థానములో సమర్థవంతంగా విధులు నిర్వహించినట్లుగానే వారు వారు బదిలీ అయిన ప్రదేశములో కూడా విధులు నిర్వహించాలన్నారు.

ఆలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు అటు భగవంతున్ని, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం లభించిందన్నారు.

తరువాత అసిస్టెంట్ కమీషనర్ హెచ్.జి. వెంకటేష్, డి.ఈ నరసింహరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావులు ప్రసంగిస్తూ ఉద్యోగుల సేవలను కొనియాడారు. అలాగే బదిలీపై వెళ్తున్న పలువురు ఉద్యోగులు కూడా ప్రసంగించారు.

చివరగా బదిలీ అయిన ఉద్యోగులందరినీ వేదాశీర్వచనంతో పాటు స్వామివార్ల శేషవస్త్రము సత్కరించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేయడం జరిగింది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *